రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

తిరుపతి: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లోని ఎగువ భాగంలో భగత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీఓపీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. అతని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. అతను పిస్తా గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.