లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం క్లారిటీ
దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు. యుద్ధంతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు వెల్లడించారు.