'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే
ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ నెల మూడో లేదా నాలుగో వారంలో తొలి పాటను విడుదల చేస్తామని ఆయన ప్రకటించాడు. అయితే, 'మొదట మేము ఎనర్జిటిక్ సాంగ్ విడుదల చేద్దామని అనుకున్నాం, కానీ నార్త్ పంపిణీదారులు మెలోడీ సాంగ్ కావాలని సూచించారు. అందుకే పాట విడుదల కాస్త ఆలస్యమవుతోంది' అని తెలిపాడు.