మానసిక దివ్యాంగురాలిపై దాడి..!

WGL: పర్వతగిరి మండలం అన్నారందర్గాలో అమానుష ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మానసిక దివ్యాంగురాలిపై దర్గా సూపరింటెండెంట్ ముంతాజ్ హుస్సేన్ ప్లాస్టిక్ పైప్‌తో విచక్షణ రహితంగా దాడి చేశారు. సుజాత అనే మహిళ మతిస్థిమితం లేక దర్గా వద్ద జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె దర్గా సమీపంలో విశ్రాంతి తీసుకుంటుండగా విచక్షణా రహితంగా దాడి చేశాడని బాధితురాలి తండ్రి కృష్ణమూర్తి తెలిపారు.