సామూహిక చిలుకు ద్వాదశి పూజలు

సామూహిక చిలుకు ద్వాదశి పూజలు

MDK: పెద్ద శంకరంపేట ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో ఆదివారం ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా చిలుకు ద్వాదశ పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో సుమారు 100 మంది మహిళలు సామూహికంగా చిలుకు ద్వాదశి పర్వదినం సందర్భంగా చెరుకు కట్టెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణుడికి, మోహిని దేవికి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణ మధ్య పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు.