'డ్రగ్స్ వద్దు బ్రో' కర్నూలులో అవగాహన కార్యక్రమం

'డ్రగ్స్ వద్దు బ్రో' కర్నూలులో అవగాహన కార్యక్రమం

కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇవాళ 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పోస్టర్లు ఆవిష్కరించి విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు పలు ఆపరేషన్లు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు.