వర్షా కాలం.. కరెంట్‌తో జర భద్రం!

వర్షా కాలం.. కరెంట్‌తో జర భద్రం!

MDK: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్ జిల్లా విద్యుత్ అధికారులు సూచించారు. గాలివానలకు విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉందని, బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు వద్ద చూసుకొని వెళ్లాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమన్నారు.