పన్నులు చెల్లించేందుకు నేడే లాస్ట్: కమిషనర్
E.G: ఆస్తి, ఖాళీ స్థల పన్నులు, కుళాయి ఛార్జీలపై 50 శాతం వడ్డీ రాయితీతో చెల్లించేందుకు మంగళవారమే చివరి రోజని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, లేనిపక్షంలో బుధవారం నుంచి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పన్నులు చెల్లించని వారి కుళాయి, విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయడంతో పాటు, జప్తు నోటీసులు జారీ చేస్తామన్నారు.