జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
KNR: పట్టుకోసం పాకులాడుతున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆ నియోజవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్‌పేటలో ఆయన పార్టీశ్రేణులతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ద్యేయంగా పని చేస్తుందని పేర్కొన్నారు.