VIDEO: రాజన్న ఆలయంలో వైభవంగా రుద్రాభిషేకం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామునే అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామివారి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.