టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
GNTR: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు సమక్షంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తాడేపల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రి రాజశేఖర్‌తో పాటు ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.