దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం భేటీ అయ్యారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. రామతీర్థం దేవస్థానంతో పాటు నాలుగు మండలాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు.