బస్సులు ఆపాలని తహసీల్దార్‌కు వినతి
NLR: బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో బస్సులను ఆపాలని వ్యాపారస్తులు నిరసన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బస్సులు ఆపకపోవడం వల్ల వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాపారస్తులు వివరించారు. బస్సులను బస్టాండ్‌లో ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.