వంతెన పరిస్థితులను పరిశీలించిన సబ్ కలెక్టర్

SRD: కంగ్టి మండలంలోని రాసోల్ -ముర్కుంజాల్ మధ్య శిథిలమైన వంతెన స్థితిగతులను ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి శనివారం సాయంత్రం పరిశీలించారు. సత్వరమే ఈ వంతెనకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రాకపోకలకు ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని పి.ఆర్ అధికారులకు ఆమె ఆదేశించారు. ఆమె వెంట సీఐ వెంకటరెడ్డి, ఎస్సై, తదితర అధికారులు సిబ్బంది ఉన్నారు.