చికెన్ విక్రయ దుకాణాలు తనిఖీ
CTR: పుంగనూరు పట్టణంలోని చికెన్ విక్రయ దుకాణాలను మంగళవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. దుకాణాల్లో మాంసాన్ని పరిశీలించారు. ఆరోగ్యకరమైన కోళ్లను, మాంసాన్ని మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బిర్యానీ సెంటర్లను తనిఖీ చేశారు.