ఇంటి పన్ను వసూలపై ప్రత్యేక డ్రైవ్

SKLM: జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయితీ అధికారుల ఆదేశాల మేరకు ఇంటి పన్ను వసూలపై ప్రత్యేక డ్రైవ్‌ను ఈవోపీఆర్డీ గోవిందరావు ఆదివారం చేపట్టారు. ఇంటి పన్ను వసూలు శత శాతం లక్ష్యంగా రెండు టీములుగా విభజించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఈవోపీఆర్డీ తెలిపారు. ఇంటి పన్ను చెల్లించి పంచాయితీ అభివృద్ధికి సహకరించాలన్నారు.