రేపల్లెలో పెండింగ్ పన్నులు చెల్లించాలి: కమిషనర్

రేపల్లెలో పెండింగ్ పన్నులు చెల్లించాలి: కమిషనర్

BPT: రేపల్లెలో ఆస్తి, నీటి పన్నులు తక్షణమే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు గురువారం ప్రజలను కోరారు. ఇప్పటివరకు రూ. 3.79 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ. 2.25 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బకాయిల వసూలు కోసం 14 బృందాలుగా ఏర్పడి సిబ్బంది గడపగడపకు వస్తున్నారని, ప్రజలు సహకరించి పన్నులు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.