ఆకస్మికంగా గుండెపోటు.. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్
SRD: అండూరు వద్ద కాళాశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కళాశాల బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి ఢీకొట్టి అదుపు చేశాడు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులో ఉన్న విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.