రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: మంగళగిరిలోని ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై విజయవాడ వైపు వెళ్తున్న అతడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడిపోయాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.