నా పేరు లేకపోవడంతోనే ఓటమి: ట్రంప్‌

నా పేరు లేకపోవడంతోనే ఓటమి: ట్రంప్‌

అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. న్యూయర్క్ మేయర్ స్థానం సహా పలు చోట్ల పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడంతోనే ఓటమి ఎదురైందన్నారు. మరోవైపు షట్‌డౌన్‌ పరిస్థితులు పరాజయానికి దారి తీశాయన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు.