కుమారుని మృతదేహాన్ని వైద్యులకు అప్పగింత
E.G: కుమారుడి మృతదేహాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లి లంకలో చోటుచేసుకుంది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి) (45) మరణించాడు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో తల్లి కుమారుడి మృతదేహాన్ని కిమ్స్ వైద్య కళాశాలకు అప్పగించారు. మంగళవారం మృతుని తల్లికి అవయవదాన పత్రం అందజేశారు.