డ్రగ్స్‌పై ‘సంకల్పం’తో విద్యార్థులకు అవగాహన
గుంటూరు జిల్లా పోలీసుల ‘సంకల్పం’ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ వకుల్ జిందల్ డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక నష్టాలు, కఠిన చట్టాలపై వివరించారు. ఆరు నెలల్లో 58 కేసుల్లో 300 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని వారికి సూచించారు.