కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
KMR: బీర్కూర్‌లోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేశ్(26)అనే యువకుడు కరెంటు షాక్‌తో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. తాను కిరాయి ఉన్న ఇంట్లో ఏదో కరెంటు సమస్య రావడంతో సరిచేద్దామనే ప్రయత్నంలో షాక్‌కు గురై మహేశ్ కిందపడి పోయాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు తెలిపారు.