పల్లె పోరు.. కాంగ్రెస్ సత్తా

పల్లె పోరు.. కాంగ్రెస్ సత్తా

TG: రాష్ట్ర పల్లె పోరులో అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 2,383 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో వైపు BRS కూడా గట్టి పోటీ ఇచ్చి 1,146 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 181 స్థానాల్లో, ఇతరులు 455 స్థానాల్లో గెలుపొందారు. కాగా ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.