VIDEO: 'ధరణి ద్వారా వేల ఎకరాల భూ కబ్జాలు'
JN: ధరణి వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని గతంలో అధికారంలో ఉన్న వారు వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేశారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బాలానగర్‌లో జరిగిన భూ బదలాయింపుల అంశంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు స్పీకర్ సహకరించాలని ఆయన కోరారు.