జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు
AKP: కసింకోట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయిలో చెకుముకి పోటీలను మంగళవారం నిర్వహించారు. సుమారు 50 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మూడ నమ్మకాలు-అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు HM స్వర్ణకుమారి తెలిపారు. ఆరుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు అబ్జర్వర్ ఆచంట రవి తెలిపారు.