అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

వరంగల్: వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జవహర్ నగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, అమ్మ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి. శ్రీజ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.