'బాడీ బిల్డింగ్'కు ఈ ప్రాంతం స్పెషల్..!
PLD: లారీలు, బస్సుల బాడీ బిల్డింగ్ పరిశ్రమకు చిలకలూరిపేట దక్షిణ భారత్‌లోనే ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఇక్కడి వర్క్ షాపులు రవాణా రంగంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే వాహన బాడీలు దృఢంగా, మన్నికగా ఉంటాయని లారీ యజమానుల నమ్మకం. వేలాది మంది వెల్డర్లు, కార్పెంటర్లు, పెయింటర్లకు ఈ పరిశ్రమ జీవనాధారంగా నిలుస్తోంది. సాంకేతికత ఎంత మారినా, ఇక్కడి మేస్త్రీల హస్తకళకు రవాణా రంగంలో సాటిలేదు.