వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

NRPT: నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టులు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు.