VIDEO: 'పెద్ద హరివనం వద్దు.. ఆదోని ముద్దు'

VIDEO: 'పెద్ద హరివనం వద్దు.. ఆదోని ముద్దు'

KRNL: ఆదోని పరిధిలోని నారాయణపురం గ్రామాన్ని కొత్తగా ఏర్పడిన పెద్ద హరివనం మండలంలో కలపడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతవేటు దూరంలో ఉన్న ఆదోనిని వదిలి కర్ణాటక సరిహద్దులో ఉండే పెద్ద హరివనం వెళ్లలేమని అన్నారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. దీనిపై ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.