ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య

ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య

కృష్ణా: గన్నవరం, వెంకట నరసింహపురంలో ప్రియుడు కోసం భర్తను ఓ మహిళ హత్య చేసింది. లక్ష్మణ్, పావని 15 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల పావని జీవితంలోకి బంధువైన ప్రదీప్‌ రావడంతో ఈ విషయం భర్త లక్ష్మణ్‌కు తెలిసింది. భార్యతో లక్ష్మణ్ గొడవ పడ్డాడు. దీంతో పావని, ప్రదీప్ కలిసి లక్ష్మణ్‌ను చంపేశారు. పావని ఏమి తెలియనట్లు అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది.