బెల్ట్ షాపులపై దాడి చేసిన మహిళలు
బాపట్ల: పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు బెల్టు మద్యం దుకాణంపై దాడి చేసిన సంఘటన మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఏడు బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలను నడిరోడ్డుపై పగలగొట్టారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు.