భారీ వర్షం నీటమునిగిన వాహనాలు

RR: హయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. బావర్చి, అపోజిట్ శ్రీనివాస హాస్పిటల్ దగ్గర మొత్తం ఆటోలు, కార్లు నీటమునిగిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భాగ్యలత నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మర్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.