అడుగంటిన సాగర్ నీటిమట్టం.!

NLG: సాగర్‌లోని నీటిమట్టం రోజురోజుకు అడుగంటుతోంది. దీంతో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరువలో ఉంది. గత ఏడాది AUGలో జలాశయంలోకి నీరు పుష్కలంగా చేరడంతో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసి 4నెలల పాటు 612TMCల నీటిని దిగువకు వృధాగా విడుదల చేశారు. ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.