నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు
HYD: నగరంలో ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించననున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే నగరంలో పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించే లక్ష్యంగా ఈ బస్సులు నడపనున్నారు.