షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్‌ను జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం మాత్రమే ఆప్షన్ కండక్ట్ చేసి, షాపులు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తద్వారా జిల్లా పరిషత్‌కు ఆదాయం వస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు పాల్గొన్నారు.