జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రత, చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు, యువతులు ఎదుర్కొనే సవాళ్లపై చర్చించి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడంపై పోలీసులు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థులు భద్రతా జాగ్రత్తలు పాటించడం, భవిష్యత్తు కోసం సరైన ప్రవర్తన అలవర్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు.