పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
PPM: వీరఘట్టం మండలంలో తుఫాన్ గాలుల కారణంగా పలు గ్రామాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ శుక్రవారం పర్యటించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. కంబర గ్రామంలో 380 ఎకరాలలో పడిపోయిన అరటి పంటను ఆయన పరిశీలించారు. పరిహారం అందించి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.