పోలీస్ స్టేషన్‌‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ

BDK: జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.