జంతువులను వధించొద్దు: కమిషనర్

జంతువులను వధించొద్దు: కమిషనర్

NZB: శ్రీరామ నవమి సందర్భంగా రేపు నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో జంతువులను వధించొద్దని, విక్రయాలు జరపవద్దని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. అలా చేస్తే వారిపై తెలంగాణ మున్సిపల్ చట్టం (TMA) 2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మాంసం, చేపలు, మేకలను, కోళ్లను తదితర జంతువులను వధించి విక్రయించే వారు దీనిని గమనించాలని సూచించారు.