రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

కృష్ణా: శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పటమట సీఐ పవన్ కిషోర్ రౌడీ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి, వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని సూచించారు. చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.