VIDEO: నీటి సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
SS: కదిరిలో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. 'జలధార' స్ఫూర్తితో వాగులను అనుసంధానిస్తూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి సంఘాల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.