టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన ఆర్డీవో
W.G: పాలకొల్లులో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో బుద్ధావతారం మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను సోమవారం సాయంత్రం నరసాపురం ఆర్డీవో దాసి రాజు ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ఆటలకు వయసుతో పనిలేదని అన్నారు. ఈ పోటీలు ఈ నెల 14వరకు జరుగుతాయని క్లబ్ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు