'అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.