ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ప్రకాశం: కంభంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నెలకొని భక్తి వాతావరణం వెల్లివిరిసింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ కమిటీ సభ్యులు పటిష్ఠ బందో బస్తు ఏర్పాటు చేశారు.