సర్వాయి పాపన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ

HYD: బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. జై గౌడ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాపన్న చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికోట రామారావు గౌడ్ పాల్గొన్నారు.