నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం
మార్కాపురం జిల్లాలో నేటి నుంచి పొదిలి, కందుకూరు-1 పరిధిలో పొగాకు వేలం ప్రారంభమవుతుందని ఒంగోలు ప్రాంతీయ అధికారి ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పండించిన పొగాకు బేళ్లను మాత్రమే రైతులు వెలంపాటకు తీసుకురావాలని సూచించారు. అంతేకాకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మంచి ధర పొందాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.