జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
W.G: భారతదేశానికి బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. వీరవాసరం మండలం తోలేరు పంచాయతీ కొండేపట్ల చెరువు వద్ద శనివారం భారత ఉప ప్రధానమంత్రి డా.బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.