జిల్లాలో వర్షాలు.. పెరిగిన సాగు

MHBD: ఇటీవల కురిసిన వర్షాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 84.56 శాతంతో వివిధ పంటల సాగు విస్తీర్ణం మొత్తం 3,52,531 ఎకరాలుగా ఉంది. దీనిలో 2,98,093 ఎకరాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేశారని, వరి 149,808 ఎకరాలు, మొక్కజొన్న 56,619 ఎకరాలు, పత్తి 78,745 ఎకరాలు సాగయిందని అధికారులు పేర్కొన్నారు. పెసర, కందులను కూడా రైతులు సాగు చేస్తున్నారు.