మృకుండ మల్లేశ్వర స్వామికి పూజలు

KDP: ఒంటిమిట్ట పరిధిలోని కొత్త మాధవరం గ్రామ శివారులో వెలసిన మృకుండ మల్లేశ్వర స్వామి దేవాలయంలో మల్లేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువ జామునే స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.